![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -382 లో... శ్రీలత మాట కాదని సందీప్ తనకి నచ్చినట్టు చెయ్యాలనుకుంటాడు. ఈ ఆస్తులన్నీ మనం దక్కించుకోవాలంటే మన చేతికి మట్టి అంటకుండా పని జరగాలి.. అలా చేసే వాడు ఒకడున్నాడని శ్రీవల్లితో సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి సెక్యూరిటీ వచ్చి.. ఒక లెటర్ ఇచ్చి ఎవరో వచ్చి మీకు ఇవ్వమన్నారని చెప్పి ఇస్తాడు.
సీతాకాంత్ ఆ లెటర్ ఓపెన్ చూసేసరికి షాక్ అవుతాడు. నేను రామలక్ష్మిని నేను బ్రతికే ఉన్నాను.. మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నానని లెటర్ ఉంటుంది. అది చదివి నా రామలక్ష్మి బ్రతికే ఉంది.. నేను మైథిలీ మెడలో పసుపు తాడు కట్టకుండా ఉండాల్సిందని అనుకొని, ఈ విషయం మైథిలీకి చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత సందీప్ ఒకతన్ని కలిసి సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిని చంపాలని చెప్తాడు. ఆ విషయం శ్రీలత విని.. వద్దు.. సీతా చాలా మంచోడని అంటుంది. నాకూ అడ్డు వస్తే నిన్ను అయిన చంపేస్తానని సందీప్ అంటాడు. ఆ తర్వాత శ్రీలతని ఒక గదిలో సందీప్ బంధిస్తాడు. మరోవైపు రామలక్ష్మి తనలో తాను మాట్లాడుకుంటుంది. నేను మైథిలీ అనుకుంటున్నారు కానీ నేను మీ రామలక్ష్మిని నాపై ప్రేమ ఇంకా ఎంతుందో తెలుసుకోవడానికి నేనే అలా లెటర్ పంపానని రామలక్ష్మి నవ్వుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి మైథిలీ గారు ఈ లెటర్ చదవండి అని ఇస్తాడు. అది చదివినట్లు యాక్టింగ్ చేసి.. అంటే ఇప్పుడు నా మెడలో తాళి కట్టి, రామలక్ష్మి ఉందని అంటున్నారా.. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అంటు సీతాకాంత్ ని అటపట్టిస్తుంది రామలక్ష్మి.
మరోవైపు సందీప్ నిజస్వరూపం తెలుసుకుంటుంది శ్రీలత. సీతా చాలా మంచివాడు అని తనలో తాను మాట్లాడుకుంటుంది. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్లారని శ్రీవల్లి వెయిట్ చేస్తుంది. మరొకవైపు ఫణీంద్ర, సుశీల కలసి రామలక్ష్మి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్లకు రామలక్ష్మి కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |